రైట్‌ రైట్‌! | - | Sakshi
Sakshi News home page

రైట్‌ రైట్‌!

Aug 1 2026 7:46 AM | Updated on Aug 1 2026 7:46 AM

కేంద్ర విధానాలపై పోరు కేంద్రం ప్రజా వ్యతిరేక విధానాలను విడనాడాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి సాయిలు డిమాండ్‌ చేశారు. వివరాలు 8లో u

కేంద్ర విధానాలపై పోరు కేంద్రం ప్రజా వ్యతిరేక విధానాలను విడనాడాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి సాయిలు డిమాండ్‌ చేశారు. వివరాలు 8లో u

బుల్లెట్‌

రైల్‌..

బుల్లెట్‌ రైల్‌ కారిడార్‌ను మొదట్లో జహీరాబాద్‌ మీదుగా నిర్మించాలని ప్రతిపాదించారు. అనూహ్యంగా జహీరాబాద్‌ను పేరును తప్పించి వికారాబాద్‌ను చేర్చడంతో స్థానికంగా ప్రజల్లో అసంతృప్తి పెల్లుబూకింది. దీంతో ఆందోళనలకు దిగారు. జహీరాబాద్‌, సంగారెడ్డి ఎమ్మెల్యేలు మాణిక్‌రావు, చింతా ప్రభాకర్‌, పార్లమెంటరీ బీఆర్‌ఎస్‌ ఫ్లోర్‌ లీడర్‌ వద్దిరాజు రవిచంద్ర, జహీరాబాద్‌ మాజీ ఎంపీ బీబీ పాటిల్‌, ఎమ్మెల్సీ అంజిరెడ్డితో పాటు ఆయా పార్టీల నాయకులు ప్రత్యేకంగా రైల్వే శాఖ మంత్రిని కలిసి వినతి పత్రాలు సమర్పించగా, ఆయన సానుకూలంగా స్పందించారు. ఈక్రమంలోనే ప్రజాప్రతినిధుల ప్రతిపాదనల మేరకు సమగ్ర పరిశీలన కోసం సంబంధింత శాఖ అధికారులకు పంపించినట్లు సమాచారం. ప్రాథమిక పరిశీలన పూర్తయిన అనంతరం తదుపరి అవసరమైన చర్యల కోసం అడుగు ముందుకు పడే అవకాశం ఉంది. క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించడం ద్వారా నివేదిక సానుకూలంగానే వచ్చే అవకాశం ఉంటుందనే ఆశాభావం ప్రజల్లో నుంచి వ్యక్తం అవుతోంది.

అన్ని విధాలుగా అర్హత

బుల్లెట్‌ రైలును నడిపేందుకు జహీరాబాద్‌ ప్రాంతం అన్ని విధాలుగా అర్హత కలిగి ఉందనే విషయమై ప్రజాప్రతినిధులు అందజేసిన నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటికే ఈ ప్రాంతంలో 12,365 ఎకరాల్లో జాతీయ పెట్టుబడుల ఉత్పాదక మండలి (నిమ్జ్‌) భారీ ప్రాజెక్టు రాబోతోంది. పలు పరిశ్రమాలకు భూములు కేటాయింపులు జరిగాయి. దీంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా 3 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. అంతే కాకుండా పారిశ్రామిక కేంద్రంగా విస్తరిస్తోంది. వీటన్నింటిని పరిగణలోకి తీసుకుని జహీరాబాద్‌ మీదుగా బుల్లెట్‌ రైలు నడపాల్సిన ఆవశ్యకత ఉంది. అయినా రాజకీయ జోక్యం మూలంగానే జహీరాబాద్‌ స్థానంలో వికారాబాద్‌ను చేర్చారనే విమర్శలున్నాయి. జహీరాబాద్‌కు బుల్లెట్‌ రైలు కనెక్టివిటీ ఉంది. అంతర్జాతీయ పెట్టుబడులు భారీగా వచ్చి చేరే అవకాశం ఉంది. జహీరాబాద్‌ మీదుగా మీదుగా బుల్లెట్‌ రైలును నడపడం ద్వారా సంగారెడ్డి జిల్లాలోని సంగారెడ్డి, అందోల్‌, పటాన్‌చెరు, నారాయణఖేడ్‌ నియోజకవర్గాలతో పాటు పక్కనే ఉన్న కర్ణాటకలోని బీదర్‌ నగర ప్రజలకు ఈ రైలు ఎంతో సౌకార్యంగా మారుతుంది.

హైదరాబాద్‌–ముంబై వయా జహీరాబాద్‌

అనుకూలతపై పరిశీలించాలని కేంద్ర రైల్వే మంత్రి ఆదేశం

పలువురు ప్రజాప్రతినిధుల చొరవ ఫలితం

పారిశ్రామిక ప్రాంతంగా

విస్తరిస్తున్నందున సానుకూలత

జహీరాబాద్‌ మీదుగా హైదరాబాద్‌–ముంబై బుల్లెట్‌ రైలు కారిడార్‌ నడిపేందుకు ఏ మేరకు అనుకూలత ఉందనే విషయమై పరిశీలించాల్సిందిగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ అధికారులను ఆదేశించడంతో ఈ ప్రాజెక్టుపై ఆశలు చిగురించాయి. జహీరాబాద్‌ మీదుగా ఎందుకు నడపవచ్చనే విషయమై ప్రజాప్రతినిధులు, ఆయా పార్టీల నాయకులు సమగ్ర సమాచారాన్ని రూపొందించి కేంద్ర మంత్రిని కలిసి వినతులు అందజేశారు. దీంతో ఆయన సానుకూలంగా స్పందించడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

– జహీరాబాద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement