నెలాఖరు వరకు ఈ–కేవైసీ | - | Sakshi
Sakshi News home page

నెలాఖరు వరకు ఈ–కేవైసీ

Aug 1 2026 7:46 AM | Updated on Aug 1 2026 7:46 AM

సంగారెడ్డి జోన్‌: రేషన్‌ కార్డుదారులకు ప్రభుత్వం ఊరట కలిగించింది. ఈ–కేవైసీ గడువు జూలై 31తో ముగియాల్సి ఉండగా.. భారీ వర్షాలు, సమగ్ర ఓటరు జాబితా రూపకల్పనలో భాగంగా లబ్ధిదారులు ఈనెల 31 వరకు ఈ–కేవైసీ పూర్తి చేసుకునేందుకు అవకాశం కల్పించింది. రేషన్‌ కార్డులో పేర్లు ఉన్న ప్రతి ఒక్క లబ్ధిదారుడు తప్పనిసరిగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని పౌర సరఫరాల అధికారులు సూచిస్తున్నారు.

జిల్లాలో 78.13 శాతం పూర్తి

జిల్లాలో 855 రేషన్‌ దుకాణాలు ఉండగా ఉన్నాయి. 4,48,446 వివిధ రకాల రేషన్‌ కార్డుదారులుండగా, అందులో 15,12,546 మంది లబ్ధిదారులు ఉన్నారు. ఇప్పటివరకు 11,84,532 మంది సభ్యులు ఈ–కేవైసీ ప్రకియ పూర్తి చేశారు. ఇంకా 3,28,014 మంది చేసుకోవాల్సి ఉంది. ఈ లెక్కన 78.13 శాతం పూర్తి అయింది. మిగితా వారు త్వరితగతిన పూర్తి చేసుకునేలా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నారు.

అనర్హుల తొలగింపు!

జిల్లావ్యాప్తంగా ఉన్న రేషన్‌ కార్డులలో బియ్యం తీసుకొని వారు, మృతిచెందిన వారిని జాబితా నుంచి తొలగించడం లేదు. దీంతో ప్రతీనెల వారి కోటా యథావిధిగా సరఫరా అవుతోంది. దీనిని అరికట్టేందుకు ప్రభుత్వం కార్డులో ఉన్న లబ్ధిదారులు తప్పనిసరిగా ఆధార్‌ కార్డు తీసుకువెళ్లి ఈ–కేవైసీ చేసుకోవాలని సూచించింది.

నేటి నుంచి మూడు నెలల బియ్యం

జిల్లావ్యాప్తంగా ఉన్న రేషన్‌ దుకాణాల్లో నేటి నుంచి ఆగస్టు, సెప్టెంబర్‌, అక్టోబర్‌ మూడు నెలలకు సంబంధించి బియ్యం ఒకేసారి పంపిణీ చేయనున్నారు. లబ్ధిదారులు రేషన్‌ దుకాణాల్లో తమ పూర్తి వివరాలు అందించి ఉచితంగా ఈ–కేవైసీ చేయించుకోవచ్చు. పెంచిన గడువును సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

గడువు పొడిగించిన ప్రభుత్వం

రేషన్‌కార్డుదారులకు ఊరట

జిల్లాలో ఇప్పటివరకు 78.13 శాతం పూర్తి

చిన్నారులు, వృద్ధులకు ఇబ్బందులు

ఆధార్‌ కేంద్రాల వద్ద పడిగాపులు

ఈ–కేవైసీ నమోదులో జిల్లాలో ఉన్న చిన్నారులతో పాటు వృద్ధులు తమ వేలిముద్రలు పడక తీవ్రస్థాయిలో ఇబ్బందులు పడుతున్నారు. వేలిముద్రలు అప్డేట్‌ చేయించుకునేందుకు ఆధార్‌ సెంటర్ల వద్ద పడిగాపులు కాస్తున్నారు. గతంలో విధించిన గడువు సమీపిస్తుండటంతో వేలిముద్రలు రాక రేషన్‌ కార్డులో తమ పేరు తొలగిపోతుందేమోనని భయందోళనకు గురయ్యారు. తాజాగా ప్రభుత్వం గడువు పెంచడంతో లబ్ధిదారులకు ఉపశమనం కలిగింది.

ఈ–కేవైసీ నమోదులో జిల్లాలో ఉన్న చిన్నారులతో పాటు వృద్ధులు తమ వేలిముద్రలు పడక తీవ్రస్థాయిలో ఇబ్బందులు పడుతున్నారు. వేలిముద్రలు అప్డేట్‌ చేయించుకునేందుకు ఆధార్‌ సెంటర్ల వద్ద పడిగాపులు కాస్తున్నారు. గతంలో విధించిన గడువు సమీపిస్తుండటంతో వేలిముద్రలు రాక రేషన్‌ కార్డులో తమ పేరు తొలగిపోతుందేమోనని భయందోళనకు గురయ్యారు. తాజాగా ప్రభుత్వం గడువు పెంచడంతో లబ్ధిదారులకు ఉపశమనం కలిగింది.

వేలిముద్రలు పడక తిప్పలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement