పటాన్‌చెరు: ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వజ్రాయుధమని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం పటాన్‌చెరు డివిజన్‌లోని క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ బ్రాహ్మణ సంక్షేమ సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటివరకు నియోజకవర్గంలో కేవలం 64.65 శాతం మాత్రమే నమోదైందని తెలిపారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో అర్హులందరూ తమ వివరాలు సమర్పించి ఓటు హక్కును కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే దేవాలయాలకు వచ్చే భక్తులకు ఎస్‌ఐఆర్ ప్రక్రియపై అవగాహన కల్పించి, ప్రతి ఒక్కరూ భాగస్వామ్యమయ్యేలా చూడాలని బ్రాహ్మణ సంఘాలను కోరారు. నియోజకవర్గంలో బ్రాహ్మణుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నామన్నారు. త్వరలోనే బ్రాహ్మణుల కోసం ప్రత్యేకంగా ఫంక్షన్ హాల్ నిర్మించి అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో గుమ్మడిదల మున్సిపల్ చైర్మన్ కుమార్ గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, కౌన్సిలర్ అంతి రెడ్డి, బండి శంకర్, తదితర బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి


