సిద్దిపేటరూరల్: కారు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందిన ఘటన మండల పరిధిలోని తోర్నాల వద్ద గురువారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. సిద్దిపేటకు చెందిన వినేశ్‌కుమార్ తన కుటుంబ సభ్యులతో కలిసి మెదక్ ఏడుపాయల దేవస్థానానికి వెళ్ళారు. వినేశ్‌కుమార్ అల్లుడైన ద్వారకేశ్ కారులో బెజిగం శ్రీలత(39) ముగ్గురు పిల్లలతో ఎడుపాయల నుంచి సిద్దిపేటకు బయలుదేరారు. ఈ క్రమంలో తోర్నాల పెట్రోల్ బంక్ సమీపంలో కారు అదుపుతప్పి పల్టీలు కొట్టింది. దీంతో శ్రీలత అక్కడికక్కడే మృతి చెందింది. గాయపడిన పిల్లలు లిఖిత్, శ్రీమాన్, శ్రేష్ఠను సిద్దిపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. వినేశ్‌కుమార్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


