అవసరానికి మించి చేసిన అప్పులే మానసికంగా కుంగదీస్తాయి. ఆదాయ మార్గాలు తగ్గిపోవడంతో పాటు, వడ్డీలు సైతం కొండంతగా మారుతాయి. దీంతో అప్పులు చేసిన వ్యక్తులు మానసిక ధ్యైర్యాన్ని కోల్పోయి ఆత్మహత్యలు చేసుకోవడానికి సిద్ధపడతారు. తన భార్యా పిల్లల భవిష్యత్తును ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఆత్మహత్యల ఆలోచనల నుంచి బయటపడొచ్చు. వ్యసనాలకు అలవాటు పడి జీవితాలను విచ్ఛిన్నం చేసుకోవద్దు. మీరు బ్రతుకుతూ, మిమ్మల్ని నమ్ముకున్న వారిని బ్రతకనివ్వండి.’
–డాక్టర్ పొన్నాల బాలయ్య, సామాజిక విశ్లేషకులు, కవి, రచయిత, సిద్ధిపేట


