పేకాట ఆడుతున్న ఆరుగురు అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

పేకాట ఆడుతున్న ఆరుగురు అరెస్ట్‌

Jul 31 2026 7:16 AM | Updated on Jul 31 2026 7:16 AM

ఝరాసంగం(జహీరాబాద్‌): గుట్టు చప్పుడు కాకుండా పేకాట ఆడుతున్న ఆరుగురిని అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ క్రాంతి కుమార్‌ పాటిల్‌ తెలిపారు. వివరాల ప్రకారం.. మండల పరిధిలోని తుమ్మన్‌ పల్లి గ్రామ శివారులో ఉన్న ఓ రేకుల షెడ్డులో బుధవారం రాత్రి పేకాట ఆడుతున్నారని సమాచారం అందిందిం. ఈ మేరకు పోలీసులు దాడులు నిర్వహించారు. పేకాట ఆడుతున్న నవాజ్‌ రెడ్డి, షేక్‌ సోహెల్‌, సురేష్‌, పిల్లోడి సాయికుమార్‌, ఫయాజ్‌, శ్రీనివాస్‌ అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు వారి నుంచి రూ. 24,440లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement