సద్వినియోగం చేసుకోవాలి
జిల్లాలో ఇలా..
జలసిరి కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ ఇంకుడు గుంతలను నిర్మించనున్నారు. వ్యక్తిగత నిర్మాణాలతో పాటు కమ్యూనిటీ ఇంకుడు గుంతలను సైతం నిర్మిస్తారు. మొదటి విడతలో ప్రతి గ్రామంలో 180 వరకు ఇంకుడు గుంతలను నిర్మించేందుకు ప్రతిపాదించారు. వ్యక్తిగత నిర్మాణానికి గాను రూ.6,500, కమ్యూనిటీ ఇంకుడు గుంతకు రూ.13 వేలు చెల్లిస్తారు. ఇందుకు కూలీలతో పాటు మెటీరియల్ కోసం ఖర్చు చేస్తారు. ఇదిలా ఉంటే గ్రామంలో నుంచి బయటకు వెళ్లే నీటిని ఒడిసిపట్టి భూమిలోకి ఇంకిచేందుకు వీలుగా గ్రామం బయట డ్రైన్ ఎండ్ పాయింట్ సోప్‌పిట్ నిర్మిస్తారు. ఇందుకోసం రూ.90 వేల వరకు ఖర్చు చేస్తారు.
పొలాల వద్ద పంట కుంటలు
వ్యవసాయ పొలాల వద్ద రైతులు పంట కుంటలు నిర్మించుకునేందుకు ప్రభుత్వం ప్రతిపాదించింది. వర్షం నీటిని ఇందులో నిల్వ చేసుకునేలా నిర్మాణాలు చేపడతారు. 15 మీటర్ల వెడల్పు, పొడవుతో రెండు మీటర్ల లోతు వంతున వీటిని తవ్వుతారు. ఈ మేరకు సామర్థ్యం ఉన్న కుంటకు రూ.1.10 లక్షలు కేటాయిస్తారు. ఇందులో కూలీల ఖర్చులతో పాటు ఇతర నిర్మాణాలకు వినియోగించుకోవచ్చు. కుంటలను నిర్మించుకోవడం ద్వారా వర్షాభావ పరిస్థితులు ఎదురైనప్పుడు ఇందులో నిల్వ ఉన్న నీటిని ఉపయోగించుకొని పంటను కాపాడుకోవచ్చు. అంతే కాకుండా పంట కుంటలో నిల్వ ఉండే నీటితో కూరగాయలకు అందించడం, మందులను పిచికారీ చేసుకునేందుకు ఉపయోగించుకోవడం, పశువులకు తాగేందుకు వాడుకునే అవకాశం కలుగుతుంది. మొదటి విడతలో ప్రతి గ్రామానికి 4 వంతున పంట కుంటలు నిర్మించాలని నిర్ణయించారు.
ఊట కుంటలు
ప్రతి గ్రామంలో ఊట కుంటను నిర్మించేందుకు ప్రతిపాదించారు. కుంట విస్తీర్ణాన్ని బట్టి రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఖర్చు చేస్తారు. ఊట కుంట నిర్మాణంతో గ్రామంలో భూగర్భజలాలు పెరిగేందుకు దోహదపడుతుంది. అంతే కాకుండా కూలీలకు ఉపాధి లభిస్తుంది. కూలీలకు పని లేనట్లయితే ఈ పథకం ద్వారా ఉపాధి పొందగలుగుతారు.
బోరు రీఛార్జ్
జలసిరి కార్యక్రమంలో భాగంగా బోరు రీఛార్జ్ నిర్మాణాలకు అవకాశం కల్పించారు. దీంతో బోర్లలో నీటి ఊటలు పెరుగుతాయి. ఇందుకోసం రూ. 35 వేల వరకు అయ్యే వ్యయం ప్రభుత్వ పరంగా అందుతుంది. ఎండిన బోర్ల వద్ద కూడ నిర్మాణాలు చేసుకోవడం ద్వారా బోరు రీఛార్జ్ చేసుకునేందుకు దోహదపడుతుంది.
వీబీజీ–రామ్‌జీ పథకం కింద జలసిరి కార్యక్రమం తీసుకున్నాం. ఇప్పటికే పంట కుంటల తవ్వకం పనులు సాగుతున్నాయి. గ్రామాల్లో ఇంకుడు గుంతలు నిర్మించుకునేందుకు ప్రజలు ముందుకు వస్తున్నారు. ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
– అశోక్‌కుమార్, ఏపీఓ, జహీరాబాద్
ఫామ్‌పాండ్‌లు 2,346
కమ్యూనిటీ ఇంకుడు గుంతలు 550
ఇంకుడు గుంతలు 1,10340
పర్కొలేషన్ ట్యాంకులు 550
బోర్‌వెల్ రీఛార్జ్ 558
బావులు 50
ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు వీలుగా ప్రభుత్వం ప్రత్యామ్నాయ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా భూగర్భ జలాలను పెంచుకోవడం ద్వారా నీటి కష్టాల నుంచి గట్టెక్కవచ్చనే ఉద్దేశంతో జలసిరి కార్యక్రమం చేపట్టింది. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్ గార్ అజీవిక మిషన్ (వీబీ జీ రాం జీ) పథకం కింద ఇంకుడు గుంతలు, పంట కుంటలు, ఊట కుంటలు, ఊట చెరువులను నిర్మించాలని నిర్ణయించింది. బోరు బావుల రీఛార్జ్ నిర్మాణాలు చేపట్టేందుకు ప్రతిపాదించింది.
– జహీరాబాద్/సంగారెడ్డిజోన్
భూగర్భజలాల కోసం ‘జలసిరి’
గ్రామ గ్రామాన ఇంకుడు గుంతలు
‘వీబీజీరాంజీ’ కింద కార్యక్రమం
ముందుకు వచ్చే లబ్ధిదారులకు నిధులు


