సంగారెడ్డి జోన్: సమగ్ర ఓటరు జాబితా రూపకల్పనలో భాగంగా చేపట్టిన సర్ ప్రక్రియ నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. బుధవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు. అనంతరం అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో సగటున 76.90 శాతం ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ పూర్తయిందని తెలిపారు. నియోజకవర్గాల వారీగా నారాయణఖేడ్ 87.66 శాతం, ఆందోల్ 86.23 శాతం, జహీరాబాద్ 80.36 శాతం, సంగారెడ్డి 77.47 శాతం, పటాన్‌చెరు 62.78 శాతం డిజిటలైజేషన్ పూర్తయిందని వెల్లడించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ సంగీత తదితరులు పాల్గొన్నారు. అనంతరం సీ్త్ర నిధి రుణాలపై సమీక్ష నిర్వహించారు. మహిళా సంఘాల సభ్యుల బినామీ పేర్లతో రుణాలు తీసుకొని వినియోగించుకుంటే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. రుణాలు తిరిగి చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో జోనల్ మేనేజర్ రవికుమార్, డీఆర్డీఓ జ్యోతి, అదనపు డీఆర్డీఓ సూర్యరావు తదితరులు పాల్గొన్నారు.


