ములుగు వీసీ రాజిరెడ్డి
ములుగు(గజ్వేల్): ఉద్యాన విశ్వవిద్యాలయం నుంచి బీఎస్సీ (ఆనర్స్) హార్టికల్చర్ పట్టభద్రులకు ప్రభుత్వ, ప్రైవేట్, పారిశ్రామిక రంగాల్లో విస్తృతమైన వృత్తి అవకాశాలు ఉన్నాయని ములుగు కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయ వీసీ డాక్టర్ రాజిరెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ, విద్యారంగం, రాష్ట్ర ప్రభుత్వ శాఖ, ఉద్యానవన, వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో ఐసీఎఆర్ సంస్థలలో హార్టికల్చర్ అధికారులుగా, పరిశోధన సహాయకులుగా పనిచేయవచ్చన్నారు. విత్తన రంగం, నర్సరీలు, తోటల పెంపకంలో కూడా పట్టభద్రులకు అవకాశాలు ఉన్నాయని తెలిపారు. పర్యావరణ మార్పుల నేపథ్యంలో కూరగాయల సాగుకు రైతులు మొగ్గు చూపాలన్నారు. అడవుల పెంపకంతో పర్యావరణ మార్పులకు చెక్ పెట్టవచ్చన్నారు.


