భక్తిశ్రద్ధలతో గురుపౌర్ణమి వేడుకలు | - | Sakshi
Sakshi News home page

భక్తిశ్రద్ధలతో గురుపౌర్ణమి వేడుకలు

Jul 30 2026 7:24 AM | Updated on Jul 30 2026 7:24 AM

ఝరాసంగం(జహీరాబాద్‌): గురు పౌర్ణమి వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. జిల్లాలో ఆధ్యాత్మిక క్షేత్రంగా బాసిల్లుతున్న బర్దిపూర్‌ దత్తగిరి మహారాజ్‌ ఆశ్రమం, కుప్పానగర్‌, చీలపల్లి గ్రామ శివారులోని మల్లయ్య గిరి ఆశ్రమాల్లో వేడుకలు నిర్వహించారు. ఆయా ఆశ్రమాల్లోని పీఠాధిపతులు 108 వైరాగ్య శిఖామణి అవధూత గిరి మహారాజ్‌, డాక్టర్‌ సిద్ధేశ్వర స్వామి, మల్లయ్య గిరి పీఠాధిపతి బసవలింగ అవధూత గిరి మహారాజ్‌ ను పూలమాలతో ఘనంగా సన్మానించారు. మల్లయ్య గిరి ఆశ్రమంలో కర్ణాటక రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఈశ్వర్‌ ఖండ్రె, ఉమ్మడి మెదక్‌ జిల్లా మాజీ జెడ్పీ చైర్‌పర్సన్‌ సునీతా పాటిల్‌, మాజీ ఎంపీ బీబీ పాటిల్‌ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు హన్మంత్‌ రావు పాటిల్‌, నరోత్తం, ఉదయ్‌ శంకర్‌ పాటిల్‌, వేణుగోపాల్‌ రెడ్డి, రాజ్‌కుమార్‌ స్వామి, పండరీనాథ్‌, యాదగిరి పాల్గొన్నారు.

పాల్గొన్న కర్ణాటక మంత్రి ఈశ్వర్‌ ఖండ్రే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement