ప్రమాదంలో యువకుడి మృతి | - | Sakshi
Sakshi News home page

ప్రమాదంలో యువకుడి మృతి

Jul 30 2026 7:24 AM | Updated on Jul 30 2026 7:24 AM

బైక్‌ను ఢీకొట్టిన లారీ..

నారాయణఖేడ్‌: నాందేడ్‌– హైదరాబాద్‌ జాతీయ రహదారిపై జరి గిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. కామారెడ్డి జిల్లా పిట్లంకు చెందిన ఆనంద్‌ ప్రభు(28) హైదరాబాద్‌కు వెళ్లడానికి తన బైక్‌పై నిజాంపేట్‌కు వచ్చాడు. బైక్‌ను అక్కడ ఉంచి మంగళవారం హైదరాబాద్‌కు వెళ్లి తిరిగి నిజాంపేట్‌కు చేరుకున్నాడు. ఈ క్రమంలో బైక్‌పై పిట్లంకు వెళుతున్న క్రమంలో వెనుక నుంచి లారీ ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతడిని ఎన్‌హెచ్‌ అంబులెన్స్‌లో ఖేడ్‌ ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కూరగాయలకు వెళ్లొస్తుండగా..

పాపన్నపేట(మెదక్‌): రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని లక్ష్మీనగర్‌ గ్రామ శివారులో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్‌ఐ శ్రీనివాస్‌గౌడ్‌ వివరాలు.. యూసుఫ్‌పేటకు చెందిన బోల వెంకటేశం (42) వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. మంగళవారం సాయంత్రం కూరగాయలు తీసుకురావడానికి గ్రామానికి చెందిన రవితో కలిసి ద్విచక్ర వాహనంపై పొడ్చన్‌పల్లి గేట్‌వద్దకు వెళ్లాడు. తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో లక్ష్మీనగర్‌ గ్రామ శివారులో వెనుకనుంచి వస్తున్న ట్రాలీ ఆటో ఢీకొట్టింది. గాయపడ్డ అతన్ని మెదక్‌ ఆస్పత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యలో మృతి చెందాడు. రవికి స్వల్ప గాయాలయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement