జహీరాబాద్: జహీరాబాద్‌కు చెందిన ఢిల్లీ వసంత్‌కు వాగ్దేవి జాతీయ పురస్కారం అ ందజేసి కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ సత్కరించారు. బుధవారం ఢిల్లీలో జాతీయ తెలుగు సాహిత్య పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్రమంత్రి పురస్కారంను ఆయనకు అందించారు. సామాజిక సేవలందించడంతో పాటు రైతు ఉద్యమాలకు నాయకత్వం వహిస్తూ, గ్రామీణాభివృద్ధి, యువత సాధికారత తదితర అంశాలపై విశేష కృషి చేస్తున్నందుకు సత్కారం పొందారు. గ్రామోదయ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ టెక్నాలజీ సంస్థను ఏర్పాటు చేసి జాతీయ స్థాయిలో రైతు రుణమాఫీ, ఆధ్యాత్మిక చైతన్యం కోసం 7వేల కిలోమీటర్ల మేర కుంభయాత్ర లాంటి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు, రైతు సంఘాల నాయకులు, రైతులు, తదితరులు వసంత్‌కు అభినందనలు తెలియజేశారు.


