న్యాయం చేయాలని మృతదేహంతో ధర్నా | - | Sakshi
Sakshi News home page

న్యాయం చేయాలని మృతదేహంతో ధర్నా

Jul 29 2026 9:51 AM | Updated on Jul 29 2026 9:51 AM

రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం

కొమురవెల్లి(సిద్దిపేట): రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందగా, బాధిత కుటుంబ సభ్యులు ప్రమాదానికి కారణమైన వ్యక్తి ఇంటి ఎదుట మృతదేహంతో ఆందోళన చేపట్టారు. ఈ ఘటన మంగళవారం మండలంలోని తపాస్‌పల్లిలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. ఈనెల 12న కొండపాక మండలంలోని బందారం గ్రామంలో సిద్దిపేట అర్బన్‌ మండలంలోని బొగ్గులోని బండ గ్రామానికి చెందిన బైరీ చార్లేస్‌(23), తపాస్‌పల్లి గ్రామానికి చెందిన రుద్రారం కనకయ్య వేర్వేరు బైక్‌లపై వెళ్తూ ఎదురెదురుగా ఢీకొన్నారు. దీంతో చార్లేస్‌కు తీవ్రగాయాలవ్వగా హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమ వారం మృతిచెందాడు. ప్రమాదానికి కార ణం కనకయ్య అని, మృతుని బంధువులు అతని ఇంటి ఎదుట మృతదేహంతో ఆందోళన చేశారు. సమాచారం అందుకున్న చేర్యాల సీఐ రమేశ్‌, ఎస్‌ మహేశ్‌ న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో విరమించారు.

హుస్నాబాద్‌: రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం చెందింది. ఈ ఘటన పట్టణంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా.. హుస్నాబాద్‌ పట్టణానికి చెందిన సాదుల యాదమ్మ (60) ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం సమీపంలోని ప్రధాన రహదారిపై మంగళవారం రాత్రి నడుచుకుంటూ రోడ్డును దాటే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో హన్మకొండ నుంచి హుస్నాబాద్‌ మీదుగా సిద్దిపేటకు వెళ్తున్న కారు వెనుక నుంచి ఆమెను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందింది. మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement