చిలప్‌చెడ్(నర్సాపూర్): తక్కువ నీటితో సాగయ్యే ఆరుతడి పంటలే మేలని మల్లారెడ్డి యూనివర్సిటీ వ్యవసాయ విద్యార్థులు పేర్కొన్నారు. మంగళవారం చిలప్‌చెడ్ రైతు వేదికలో గ్రామీణ కృషి అనుభవ కార్యక్రమంలో భాగంగా కేవీకే ఆధ్వర్యంలో రైతులకు ఆరుతడి పంటలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి మండల ప్రత్యేకాధికారి నిత్యానంద్, ఏఓ రాజశేఖర్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ.. ముఖ్యంగా రైతులు తక్కువ నీటి వినియోగంతో సాగయ్యే పంటలను పండించాలని సూచించారు. ఎక్కువ నీటి వినియోగంతో సాగయ్యే వరితో పంట చేతికి వచ్చే సమయానికి ఎల్‌నినో ప్రభావంతో సమస్యలు రావచ్చన్నారు. విత్తనమేళాలో భాగంగా కంది, మినుము, ఆముదం, ఆయా కూరగాయల విత్తనాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈఓలు కృష్ణవేణి, వంశీ, విద్యార్థులు హారిక, హరిణి, లావణ్య, నిఖిత, వందిత, రైతులు పాల్గొన్నారు.
మల్లారెడ్డి యూనివర్సిటీ
వ్యవసాయ విద్యార్థులు


