● 637 క్యూసెక్కుల నీరు చేరిక
● తాగునీటికి 470 క్యూసెక్కుల సరఫరా
పుల్‌కల్(అందోల్): సింగూరు ప్రాజెక్టులోకి స్వల్పంగా వరద నీరు చేరింది. ఈ సీజన్‌లో ఎల్‌నినో ప్రభావంతో భారీ వర్షాలు కురవకపోవడంతో డ్యాంలోకి చుక్కనీరు రాలేదు. మూడు రోజుల నుంచి వర్షాలు కురుస్తుండటంతో ప్రాజెక్టులోకి స్వల్పంగా నీరు చేరుతుంది. మంగళవారం ప్రాజెక్టులోకి 637 క్యూసెక్కుల నీరు చేరిందని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. డ్యాం మరమ్మతుల దృష్ట్యా 29.9 టీఎంసీలకు గాను, తక్కువ నీటిని నిల్వ ఉంచుతున్నారు. డ్యామ్ నీటిమట్టం 523.600 మీటర్లకు నీటి సామర్థ్యం 29.9 టీఎంసీలు కాగా ప్రస్తుతం 515.280 మీటర్లకు 4.322 టీఎంసీల నీరు నిల్వ ఉంది. డ్యాం నుంచి మిషన్ భగీరథకు, జంట నగరాల తాగునీటికి 470 క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తున్నారు.


