ఫామ్‌పాండ్‌లతో భూగర్భజలాల వృద్ధి | - | Sakshi
Sakshi News home page

ఫామ్‌పాండ్‌లతో భూగర్భజలాల వృద్ధి

Jul 28 2026 7:14 AM | Updated on Jul 28 2026 7:14 AM

అదనపు డీఆర్‌డీఓ బాలరాజు

అదనపు డీఆర్‌డీఓ బాలరాజు

సంగారెడ్డిటౌన్‌: ఫామ్‌ పాండ్‌ల ఏర్పాటుతో భూగర్భ జలాలు వృద్ధి చెందుతాయని అదనపు డీఆర్‌డీఓ బాలరాజు అన్నారు. సోమవారం సంగారెడ్డి మండలంలోని పసల్వాది పంచాయతీలో వీబీ జీ రాం జీ పథకంలో భాగంగా ఫామ్‌ పాండ్‌కు భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులందరూ తమ పొలాల వద్ద వ్యవసాయ కుంటలను ఏర్పాటు చేసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయన్నారు. కుంటలను ఏర్పాటు చేసి వర్షపు నీటిని నిల్వ ఉంచడం వల్ల భూగర్భజలాలు గణనీయంగా పెరుగుతాయని చెప్పారు. నిల్వ ఉన్న నీరు భూమిలోకి ఇంకి చుట్టుపక్కల ఉన్న బోర్లు, బావుల్లో నీటి మట్టాలు పైకి వస్తాయని వివరించారు. కార్యక్రమంలో సంగారెడ్డి ఎంపీడీఓ నిహారిక, ఎంపీఓ శ్రీకాంత్‌, ఏపీఓ మధుసూదన్‌రావు, సర్పంచ్‌ హరిప్రసాద్‌, పంచాయతీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement