లాలిస్తూ.. ఆడిస్తూ..! | - | Sakshi
Sakshi News home page

లాలిస్తూ.. ఆడిస్తూ..!

Jul 28 2026 7:14 AM | Updated on Jul 28 2026 7:14 AM

సీడీఎస్‌ ప్రాజెక్టు పరిధిలోని ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ కేంద్రాల టీచర్లు, సహాయకుల పోస్టుల భర్తీ ప్రక్రియ జోరుగా సాగుతోంది. ఈ పోస్టుల కోసం దాదాపు 1,000 మంది యువతులు, మహిళలు దరఖాస్తు చేసుకున్నారు. సోమవారం స్థానిక ఐసీడీఎస్‌ ప్రాజెక్టు కార్యాలయంలో దరఖాస్తుదారుల ధ్రువపత్రాల పరిశీలనను అధికారులు చేపట్టగా, మహిళలు భారీగా తరలివచ్చారు. అయితే చిన్న పిల్లలు ఉన్న మహిళలు ధ్రువపత్రాల పరిశీలనకు రాగా, వారి వెంట పిల్లల ఆలనాపాలనా చూసేందుకు వారి భర్తలు కూడా వెంట వచ్చారు. లోపల మహిళలు సర్టిఫికెట్ల పరిశీలనలో బిజీగా ఉండగా.. కార్యాలయ ఆవరణలో తండ్రులు తమ చిన్నారులను ఎత్తుకొని లాలిస్తూ, ఆడిస్తూ కనిపించారు. – నారాయణఖేడ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement