నవోదయ పిలుస్తోంది | - | Sakshi
Sakshi News home page

నవోదయ పిలుస్తోంది

Jul 28 2026 7:08 AM | Updated on Jul 28 2026 7:08 AM

ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

దరఖాస్తు ఇలా చేయాలి

చివరి తేదీ ఈ నెల 31 వరకు

పరీక్షలో నెగెటివ్‌ మార్క్‌ విధానం

వర్గల్‌ నవోదయ విద్యాలయం

ఉమ్మడి జిల్లాలోని జవహర్‌ నవోదయ విద్యాలయం ఆరవ తరగతిలో ప్రవేశాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ప్రతిభావంతులైన విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు ఈ విద్యాలయం కృషి చేస్తోంది. ఉన్నత ప్రమాణాలతో కూడిన ఆధునిక విద్యను అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ విద్యాలయంను జిల్లాలో ఏర్పాటు చేసింది. ఆధునిక విద్యతో పాటు సాంకేతిక అవగాహన, క్రీడల్లో విద్యార్థులు రాణించేలా కృషి చేస్తోంది.

– సంగారెడ్డి ఎడ్యుకేషన్‌/సంగారెడ్డి క్రైమ్‌

మ్మడి జిల్లాలోని వర్గల్‌ జవహర్‌ నవోదయ విద్యాలయంలో 2026–27 విద్యా సంవత్సరానికి గాను ఆరవ తరగతిలో ప్రవేశాలకు ఆన్‌్‌లైన్‌లో దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ప్రవేశానికి ఉమ్మడి జిల్లాలో 5వ తరగతి చదువుతున్న ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులతో పాటు ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్‌ పాఠశాల విద్యార్థులు అర్హులు. ఆరవ తరగతి నుంచి ఇంటర్మీడియెట్‌ వరకు ఉచిత విద్యను ఈ విద్యాలయంలో అందిస్తారు.

పరీక్ష విధానం

ప్రవేశపరీక్ష పూర్తిగా ఆబ్టెక్టివ్‌ పద్ధతిలో ఓఎంఆర్‌ విధానంలో ఉంటుంది. మూడు విభాగాల్లో పరీక్ష నిర్వహిస్తారు. అర్థమెటిక్‌–25 మార్కులు, లాంగ్వేజ్‌ టెస్ట్‌–25 మార్కులు, మెంటల్‌ ఎబిలిటీ అండ్‌ ఎన్విరాన్మెంటల్‌ స్టడీస్‌కు–50 మార్కులకు సంబంధించి వంద మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం రెండు గంటలు. ప్రశ్నాపత్రం ఆంగ్లం, హిందీ భాషలో ఉంటుంది. నెగెటివ్‌ మార్క్‌ కూడా ఉంటుంది.

అర్హతలు

ఉమ్మడి జిల్లా పరిధిలో నివాసితులై ఉండాలి.

01–05–2015, 31–07–2017 మధ్య జన్మించి ఉండాలి.

బాలికలకు 33% రిజర్వేషన్‌ ఉంటుంది.

ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం నిబంధనల ప్రకారం రిజర్వేషన్లు.

అభ్యర్థులు ఈ నెల 31వ తేదీలోపు నవోదయ విద్యాలయ అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థి ఫొటో, సంతకం, తల్లిదండ్రుల సంతకం, ఆధార్‌ వివరాలలో పాటు నివాస, కుల పత్రాలు అప్‌లోడ్‌ చేయాలి. పరీక్ష నవంబర్‌ 28న నిర్వహిస్తారు. ఆన్‌లైన్‌లో ఉచితంగా నమోదు చేసుకోవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement