ఫలితాల బుక్‌లెట్ అందజేసిన నిపుణుడు అఫ్సర్
జహీరాబాద్: చతుర్విద జలప్రక్రియ ఉపయోగాలపై జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్‌కు కార్యక్రమ జాతీయ స్థాయి నిపుణుడు, గొటిగార్‌పల్లి గ్రామానికి చెందిన ఎండి. అఫ్సర్ నివేదించారు. సోమవారం కలెక్టర్‌ను కలిసి తక్కువ ఖర్చుతో జాతీయ స్థాయిలో పలు రాష్ట్రాల్లో చేపట్టిన చతుర్విద జల ప్రక్రియ కార్యక్రమ ఫలితాల గురించి వివరించారు. ఇందుకు సంబంధించి రూపొందించిన బుక్‌లెట్‌ను కలెక్టర్‌కు అందజేశారు. జహీరాబాద్ మండలంలోని గొటిగార్‌పల్లి గ్రామంలో రెండు దశాబ్దాల క్రితం చేపట్టిన ఈ కార్యక్రమం విజయవంతం అయింది. దీని స్ఫూర్తితో ఎడారి ప్రాంతమైన రాజస్తాన్‌లో అక్కడి ప్రభుత్వం అమలు చేసి సాధించిన ఫలితాల గురించి కలెక్టర్‌కు వివరించారు. ప్రస్తుతం గ్రామంలో భూగర్భ జలాలు పుష్కలంగా ఉన్నాయన్నారు. త్వరలో గ్రామాన్ని సందర్శించి ఫలితాల గురించి ప్రత్యక్షంగా చూస్తానని కలెక్టర్ చెప్పినట్లు అఫ్సర్ పేర్కొన్నారు.


