గణితంపై భయం పోగొట్టాలి | - | Sakshi
Sakshi News home page

గణితంపై భయం పోగొట్టాలి

Jul 28 2026 7:08 AM | Updated on Jul 28 2026 7:08 AM

సమగ్ర శిక్షణ కోర్సు డైరెక్టర్‌ కరీమొద్దీన్‌

గజ్వేల్‌: విద్యార్థుల్లో గణితంపై భయాన్ని పోగొట్టి ఆసక్తిని పెంపొందించేలా బోధన సాగాలని సమగ్ర శిక్షణ కోర్సు డైరెక్టర్‌, హెచ్‌ఎం కరీమొద్దీన్‌ సూచించారు. సోమవారం గజ్వేల్‌ ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయులకు మూడు రోజుల శిక్షణ కార్యక్రమం ప్రారంభించారు. ఈ శిక్షణకు ఆయన హాజరై మాట్లాడుతూ.. చిన్న, చిన్న కృత్యాలు, గ్రూపు యాక్టివిటీ ద్వారా విద్యార్థుల్లో ఉన్న అభ్యసనాలోపాలను అధిగమించవచ్చని తెలిపారు. గజ్వేల్‌ డివిజన్‌లోని ఏడు మండలాలకు చెందిన గణిత ఉపాధ్యాయులు శిక్షణలో పాల్గొనగా రిసోర్స్‌పర్సన్‌లుగా వంటేరు సత్యనారాయణరెడ్డి, శ్రీనివాస్‌. అశోక్‌రెడ్డి, సుభాష్‌చంద్రారెడ్డి, భాస్కర్‌, వెంకటేశ్వర్‌, సతీశ్‌కుమార్‌, చంద్రారెడ్డి వ్యవహరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement