సీ్త్రనిధి రుణాల రికవరీలో వేగం | - | Sakshi
Sakshi News home page

సీ్త్రనిధి రుణాల రికవరీలో వేగం

Jul 28 2026 7:08 AM | Updated on Jul 28 2026 7:08 AM

మెదక్‌ కలెక్టరేట్‌: సీ్త్రనిధి రుణాల రికవరీని వేగవంతం చేసి 90శాతం పూర్తయ్యేలా ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం సమీకృత కలెక్టరేట్‌లో సీ్త్రనిధి రుణాల రికవరీపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో సీ్త్రనిధి రుణాల రికవరీ, పెండింగ్‌ బకాయిలు, మండలాల వారీ పురోగతి, భవిష్యత్‌ కార్యాచరణపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. రికవరీ శాతం తక్కువగా ఉన్న మండలాలు ఏపీఎంలు, మండల సమాఖ్య అధ్యక్షులను నేరుగా కలెక్టర్‌ ప్రశ్నించారు. వెనుకబడిన కారణాలను విశ్లేషించి ఆయా మండలాలకు ప్రత్యేక యాక్షన్‌ ప్లాన్‌ రూపొందించి, క్షేత్రస్థాయిలో అమలు చేయాలని ఆదేశించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ.. వచ్చే రెండునెలల్లో కనీసం 90శాతం రుణాలు రికవరీ అయ్యేలా ప్రణాళిక సిద్ధం చేసి యుద్ధ ప్రాతిపదికన అమలు పర్చాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఏ ప్రాజెక్టు డైరెక్టర్‌ శ్రీనివాసరావు, అదనపు డీఆర్డీఓ సరస్వతి, మెప్మా పీడీ హనుమంత రెడ్డి, సీ్త్రనిధి జోనల్‌ మేనేజర్‌ రవికుమార్‌, రీజినల్‌ మేనేజర్‌ గంగారం తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement