వర్గ పోరాటంతోనే కులనిర్మూలన | - | Sakshi
Sakshi News home page

వర్గ పోరాటంతోనే కులనిర్మూలన

Jul 27 2026 7:26 AM | Updated on Jul 27 2026 7:26 AM

నారాయణఖేడ్‌: కులవ్యవస్థ నిర్మూలనకు వర్గపోరాట దృక్పథం ఒక్కటే మార్గమని కేవీపీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్‌ బాబు అన్నారు. ఓ ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న కేవీపీఎస్‌ జిల్లాస్థాయి శిక్షణ తరగతుల్లో ఆదివారం ఆయన పాల్గొని మాట్లాడారు. వర్గ పోరాటం ఒక్కటే సమాజ మార్పునకు చోదక శక్తిగా ఉంటుందన్నారు. కులాల మధ్య ఘర్షణ పీడిత వర్గ ఐక్యతకు ఆటంకంగా నిలుస్తాయని, అన్ని కులాల్లో పీడిత వర్గాన్ని ఏకం చేస్తేనే మార్పు సాధ్యమన్నారు. అన్ని రకాల అసమానతలను తొలగించేందుకు వర్గ పోరాటం ఒక్కటే ఏకై క ఆయుధం అని చెప్పారు. రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు అతిమెల మాణిక్యం మాట్లాడుతూ జిల్లాలో కేవీపీఎస్‌ ఆధ్వర్యంలో అనేక సమాజిక ఉధ్యమాలు నిర్వహించినట్లు గుర్తు చేశారు. నాయకులు మద్దూరి శికుమార్‌, కొటారి నర్సింహులు, సుభాష్‌, గణపతి, మల్లేశ్‌, సంతోష్‌ కుమార్‌, జిల్లా కమిటీ సభ్యులు చంద్రశేఖర్‌, జైకుమార్‌, అరుణ్‌, శరణప్ప పాల్గొన్నారు.

కేవీపీఎస్‌ రాష్ట్ర నేత స్కైలాబ్‌ బాబు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement