పటాన్‌చెరు: జాతీయ రహదారి 65 విస్తరణలో భాగంగా ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని రుద్రారం ప్రజలకు నష్టం కలగకుండా చర్యలు చేపట్టడంతో పాటు విస్తరణలో ఆస్తులు కోల్పోయే ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి హామీ ఇచ్చారు. అతి త్వరలో జాతీయ రహదారుల సంస్థ ఈఎన్సీ ధర్మారెడ్డి, కలెక్టర్‌తో కలిసి రుద్రారంలో సమావేశం ఏర్పాటు చేసి శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపట్టబోతున్నట్లు తెలిపారు. శనివారం సాయంత్రం గ్రామంలోని వార్డు కార్యాలయంలో జాతీయ రహదారుల సంస్థ అధికారులు, కౌన్సిలర్లు, మాజీ ప్రజాప్రతినిధులు, గ్రామస్తులతో సమావేశమయ్యారు. ఈసందర్భంగా రహదారి విస్తరణలో ఎదురయ్యే నష్టాలను గ్రామస్తులు వివరించారు. ఇరువైపులా 50 ఫీట్ల చొప్పున విస్తరణ పనులు చేపడతామని చెప్పి.. నేడు 75 గజాలు నిర్ణయించడం సరికాదన్నారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే అతి త్వరలో శాశ్వత పరిష్కారం చూపెడతామని హామీ ఇచ్చారు. సమావేశంలో డీఈ సందీప్, శ్రీకాంత్, సీనియర్ నాయకులు, కౌన్సిలర్ పాండు, కౌన్సిలర్లు వెంకటేశ్, రాజు, సందీప్ గౌడ్, మాజీ సర్పంచ్ సుధీర్‌రెడ్డి, సిద్ధి వినాయక దేవాలయం కమిటీ చైర్మన్ హరిప్రసాద్ రెడ్డి, రాజు, బలరాం, గ్రామస్తులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి


