గడువులోగా ఎస్‌ఐఆర్‌ పూర్తి చేయాలి | - | Sakshi
Sakshi News home page

గడువులోగా ఎస్‌ఐఆర్‌ పూర్తి చేయాలి

Jul 23 2026 6:54 AM | Updated on Jul 23 2026 6:54 AM

పటాన్‌చెరు టౌన్‌: ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్‌ పాండు అధికారులను ఆదేశించారు. బుధవారం పటాన్‌చెరులో సహాయ ఓటరు నమోదు అధికారులు (ఏఈఆర్‌ఓలు), బీఎల్‌ఓలతో ఎస్‌ఐఆర్‌ పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఏఎస్‌డీ, రేషనలైజేషన్‌, ఎస్‌ఐఆర్‌ వివరాల డిజిటలైజేషన్‌ పనులను వేగవంతం చేసి, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. ప్రతి దశను క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ నిబంధనలకు అనుగుణంగా ప్రక్రియను చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. సమావేశంలో నియోజకవర్గ పరిధిలోని తహసీల్దార్లు, డిప్యూటీ కమిషనర్లు, మున్సిపల్‌ కమిషనర్లు పాల్గొన్నారు. మెదక్‌ కలెక్టరేట్‌: వృద్ధులను వేధిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా సంక్షేమ అధికారి హేమభార్గవి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో ఇటీవల వృద్ధులపై శారీరక దాడులు, మానసిక వేధింపులు, ఆర్థిక దోపిడీ, ఆస్తి కోసం ఒత్తిడి చేయడం, ఇంటి నుంచి వెళ్లగొట్టడం వంటి ఘటనలు పెరుగుతున్నట్లు తెలిపారు. ఇది మానవత్వానికి, కుటుంబ విలువలకు చట్టానికి విరుద్ధమైన చర్యగా పేర్కొన్నారు. పిల్లలు చట్ట ప్రకారం తల్లిదండ్రుల పోషణ, వైద్య సంరక్షణ, సంక్షేమం కల్పిచాల్సిన బాధ్యత ఉందన్నారు.

నేడు మూడు జిల్లాల

కలెక్టర్లతో సమీక్ష

ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్‌

హుస్నాబాద్‌: ఎల్‌నినో ప్రభావం ఎదుర్కొనేందుకు ఆయా శాఖల అధికారులతో నిర్వహించనున్న సన్నాహక సమావేశానికి మూడు జిల్లాల కలెక్టర్లు హాజరు కానున్నట్లు సిద్దిపేట జిల్లా కలెక్టర్‌ హైమావతి తెలిపారు. నియోజకవర్గంలోని ఏడు మండలాల వివిధ శాఖల అధికారులతో నిర్వహించే సమీక్ష ఏర్పాట్లను బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ హై మావతి మాట్లాడుతూ... వివిధ శాఖల అధికారుల యాక్షన్‌ ప్లాన్‌ తెలపడం కోసం ప్రొజెక్టర్‌ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అనంతరం ఇంజనీరింగ్‌ కళాశాల విద్యార్థినుల వసతి కోసం కేటాయించిన రైతు బజార్‌ను పరిశీలించారు. ఆర్డీఓ రామ్మూర్తి, కళాశాల అద్యాపకులు పాల్గొన్నారు.

రోజంతా ముసురు

సంగారెడ్డి టౌన్‌: జిల్లా కేంద్రంతో పాటు చుట్టు పక్కల గ్రామాల్లో బుధవారం తెల్లవారుజాము నుంచే వర్షం ప్రారంభమైంది. రోజంతా ముసురు పట్టడంతో విద్యార్థులు, ఉద్యోగులు, చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. అటు రైతులు మాత్రం ఆనందంతో పొలాల్లో తమ పనుల్లో బిజీగా కనిపించారు. వర్షాలు ఇలాగే కురిస్తే చెరువులు, కుంటలు నిండి పంటలు పండుతాయని, అటు పశువులకు గడ్డి సైతం దొరుకుతుందని రైతులు పేర్కొంటున్నారు.

సర్‌కు సహకరించండి

వెల్దుర్తి(తూప్రాన్‌): వెల్దుర్తి మండలంలోని పలు గ్రామాల్లో కొనసాగుతున్న సమగ్ర ఓటరు సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియను రాష్ట్ర సాంస్కృతిక శాఖ చైర్‌పర్సన్‌, ఎస్‌ఐఆర్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి వెన్నెల పరిశీలించారు. ఈసందర్భంగా సర్వే నిర్వహిస్తున్న బీఎల్‌ఓలతో మాట్లాడి ప్రక్రియ పురోగతిపై ఆరా తీశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. అర్హులు ఓటరు ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకునేలా అధికారులు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలని సూచించారు. ఇప్పటికే ఓటరు జాబితాలో పేర్లు ఉన్నవారు తమ వివరాలను మరోసారి పరిశీలించుకోవాలన్నారు. గ్రామాల్లో నిర్వహిస్తున్న సర్వేకు ప్రతి ఒక్కరూ సహకరించి సరైన వివరాలను అందించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

‘వృద్ధులను వేధిస్తే చర్యలు’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement