నారాయణఖేడ్: ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ (సర్)పై ఆదివారం ఉదయం 10గంటలకు పట్టణంలోని జీవన్ ఫంక్షన్‌హాలులో ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే సంజీవరెడ్డి తెలిపారు. తనతోపాటు జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి సచిన్ సావంత్, జిల్లా ఇన్‌చార్జి, రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఫయీమ్, ముఖ్య శిక్షకులు రాజీవ్ పాల్గొని ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై, బూత్ స్థాయి ఏజెంట్లు అనుసరించాల్సిన వ్యూహాలపై దిశా నిర్దేశం చేయనున్నారని చెప్పారు. నియోజకవర్గంలోని బూత్ స్థాయి ఏజెంట్లు, సర్పంచ్‌లు, మాజీ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కాంగ్రెస్, కాంగ్రెస్ అనుబంధ సంఘాల బాధ్యులు, గ్రామస్థాయి యువ నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
త్వరలో ఆర్టీసీలో ఎన్నికలు
రీజినల్ మేనేజర్ విజయ్ భాస్కర్
సంగారెడ్డి టౌన్: త్వరలో ఆర్టీసీలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు రీజినల్ మేనేజర్ విజయ్ భాస్కర్ తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. యూనియన్ల పునరుద్ధరణ, ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేసే అంశంపై నిర్ణయం తీసుకున్నామని, దీనికి సంబంధించి ఒక కమిటీని ఏర్పాటు చేశారన్నారు. అన్ని డిపోలలో కార్మిక శాఖ పర్యవేక్షణలో అత్యంత పారదర్శక పద్ధతిలో యూనియన్ వెరిఫికేషన్ ప్రక్రియను నిర్వహించడానికి తగిన చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. కమిటీ ఇప్పటికే ప్రత్యేకంగా సమావేశమై సంబంధించిన అన్ని సాంకేతిక ,ఆర్థిక పరిపాలనపరమైన అంశాలపై లోతైన సమీక్ష నిర్వహిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో డిప్యూటీ రీజినల్ మేనేజర్ మధుసూదన్ పాల్గొన్నారు.
అంజన్న సన్నిధిలో
భక్తజన సందడి
శివ్వంపేట(నర్సాపూర్): చాకరిమెట్ల సహకార ఆంజనేయస్వామి ఆలయంలో శనివారం భక్తజన సందడి నెలకొంది. వేసవి సెలవులు ముగుస్తుండటంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దంపతులు అభిషేకం అనంతరం సత్యనారాయణస్వామి మండపంలో సామూహిక వ్రతాలు ఆచరించారు. మండల పరిధిలోని ఉసిరికపల్లికి చెందిన బీఆర్‌ఎస్ నాయకుడు కృష్ణారావు భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఆలయం వద్ద నిర్వహిస్తున్న నిత్య అన్నదానానికి భక్తులు వస్తు, ధన రూపంలో సహాయం అందించాలని ఈఓ శ్రీనివాస్, ఆలయ చైర్మన్ ఆంజనేయశర్మ కోరారు.
ఈకేవైసీ తప్పనిసరి
నెలాఖరుతో ముగియనున్న గడువు
గ్యాస్ లబ్ధిదారులు సైతం..


