కేటీఆర్‌ను కలిసిన గుంతపల్లి సర్పంచ్‌ | - | Sakshi
Sakshi News home page

కేటీఆర్‌ను కలిసిన గుంతపల్లి సర్పంచ్‌

Jun 2 2026 7:40 AM | Updated on Jun 2 2026 7:40 AM

కొండాపూర్‌(సంగారెడ్డి): మండల పరిధిలోని గుంతపల్లి సర్పంచ్‌ పడమటి అనంత్‌ రెడ్డి సోమవారం హైదరాబాద్‌లోని మాజీ మంత్రి కేటీఆర్‌ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ సంగారెడ్డి నియోజకవర్గ అభివృద్ధిపై ఆరా తీశారు. అనంతరం రైతులు కొనుగోలు కేంద్రాల్లో ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని సూచించినట్లు తెలిపారు. గత పదేళ్లుగా యువకుడిగా ఉంటూ గ్రామాభివృద్ధితో పాటు పేద ప్రజలకు అనంత్‌ రెడ్డి చేస్తున్న సేవలను కొనియాడారు. కష్టకాలంలో పార్టీలో ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేసిన వారికే రానున్న కాలంలో సముచిత స్థానం కల్పిస్తానని హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. గుంతపల్లి గ్రామాభివృద్దికి తన వంతు సహాయ, సహాకారాలు అందిస్తానని తెలిపారన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement