ఉద్యమకారులకు ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలి | - | Sakshi
Sakshi News home page

ఉద్యమకారులకు ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలి

Jun 2 2026 7:40 AM | Updated on Jun 2 2026 7:40 AM

జహీరాబాద్‌ టౌన్‌: తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వం ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలని మాజీ ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ పిడమర్తి రవి కోరారు. సోమ వారం పట్టణానికి వచ్చిన సందర్భంగా పద్మశాలి భవనంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గాల వారీగా ఉద్యమకారులను గుర్తించి 250 గజాల ఇంటి స్థలాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారులు రాములు నేత, రాంచందర్‌ భీంవంశీ, గడ్డం జనార్థన్‌, నారాయణరెడ్డి, జనార్దన్‌రెడ్డి పాల్గొన్నారు.

మాజీ కార్పొరేషన్‌ చైర్మన్‌ పిడమర్తి రవి

Advertisement
 
Advertisement
Advertisement