మునిపల్లి(అందోల్): మేడ్చల్‌కు చెందిన శ్రీనివాస్ గానుగపూర్ వెళ్లి తిరిగి వస్తుండగా లింగంపల్లి సమీపంలో ప్రమాదవశాత్తు కారు ఇంజిన్‌లో నుంచి మంటలు వచ్చాయి. వివరాల ప్రకారం 65వ నంబర్ జాతీయ రహదారి కంకోల్ టోల్ ప్లాజా సమీపంలోని లింగంపల్లి చౌరస్తా సమీపంలో సోమవారం భోజనం చేయడానికి కారునుంచి కిందకు దిగారు. అయితే కొద్దిసేపటికే కారు ఇంజన్ నుంచి ఒక్కసారిగా మంటలు వచ్చాయి. జాతీయ రహదారిపై తిరుగుతున్న వివిధ రకాల వాహనదారులు కాసేపు అక్కడే ఆపేశారు. బుదేరా పోలీస్‌లకు విషయం తెలియగానే సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.


