పటాన్‌చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో జిల్లాకు చెందిన మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ క్రీడాకారులు అద్భుతమైన ప్రదర్శన అందించడం అభినందనీయమని ఎమ్మెల్యే, మాస్టర్స్ అథ్లెటిక్ అసోసియేషన్ రాష్ట్ర చీఫ్ ప్యాట్రాన్ గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. గత నెల 23, 24వ తేదీలలో శ్రీలంక రాజధాని కొలంబోలో జరిగిన మాస్టర్స్ అథ్లెటిక్స్ ఇంటర్నేషనల్ మీట్‌లో దేశం తరపున జిల్లా మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్‌కు చెందిన 14 మంది క్రీడాకారులు వివిధ క్రీడా పోటీల్లో పాల్గొన్నారు. మొత్తం 52 పతకాలు సాధించగా.. వీటిలో బంగారు పతకాలు 27, వెండి పతకాలు 11, కంచు పతకాలు 4 ఉన్నాయి. ఈ సందర్భంగా సోమ వారం ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు. గత 20ఏళ్లుగా తమ క్రీడా పోటీలకు సంపూర్ణ సహకారం అందిస్తున్న ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 80, 90 ఏళ్ల వృద్ధాప్యంలోనూ అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారని అభినందించారు. రాబోయే రోజుల్లోనూ మరిన్ని పథకాలు సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ఫహీం ఇక్బాల్, ప్రధాన కార్యదర్శి శామ్యూల్, ఉపాధ్యక్షుడు బాలయ్య, నరేందర్ రెడ్డి, భాస్కరరావు పాల్గొన్నారు.
పచ్చదనమే ప్రజారోగ్యానికి పునాది
రామచంద్రాపురం(పటాన్‌చెరు): పటాన్‌చెరు, అమీన్‌పూర్ సర్కిల్ పరిధిలోని డివిజన్‌లలో 24 పార్కుల అభివృద్ధి ప్రత్యేక నిధులు మంజూరయ్యాయని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. సోమవారం తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని కొల్లూరు కేసీఆర్‌నగర్, తెల్లాపూర్ హూడా కాలనీలో పార్కుల అభివృద్ధికి ఆయన శంకుస్థాపన చేశారు. తహసీల్దార్ సరస్వతి, ఉప కమిషనర్ జ్యోతిరెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్‌రాములు గౌడ్, మాజీ సర్పంచ్ సోమిరెడ్డి, మాజీ కౌన్సిలర్‌లు బాలాజీ, నాగారాజు, శ్రీశైలం, నాయకులు మాల్లారెడ్డి, దేవేందర్ యాదవ్, శ్రీపాల్ రెడ్డి, ఉమేష్, శ్రీకాంత్ రెడ్డి, సాయిచరణ్ గౌడ్ పాల్గొన్నారు.
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి


