అభివృద్ధి పనుల ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధి పనుల ప్రారంభం

Jun 2 2026 7:40 AM | Updated on Jun 2 2026 7:40 AM

హత్నూర(సంగారెడ్డి): మండలంలోని గుండ్ల మాచునూర్‌లో సీసీ రోడ్డు నిర్మాణం, చెరువులో ఉపాధి పనులను సోమవారం సర్పంచ్‌ శ్రీహరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో ప్రాధాన్యత పరంగా అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. పెద్ద చెరువులో ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ ద్వారా చేపట్టిన ఉడికతీత పనులతో చెరువు లోతు కావడంతో పాటు ఆ మట్టిని పొలాల్లో వేసుకున్నట్లయితే సారవంతం పెరిగే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్‌ గునుకుంట్ల శంకర్‌, పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్‌ కుమార్‌, సభ్యులు బద్రేశ్‌, శివకుమార్‌, మల్లమ్మ, అంకిత ప్రభాకర్‌, జలీల్‌, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.

పదవీ బాధ్యతల స్వీకరణ

జహీరాబాద్‌ టౌన్‌: స్థానిక మున్సిపల్‌ కమిషనర్‌గా ప్రభాకర్‌ సోమవారం పదవీబాధ్యతలు స్వీకరించారు. కమిషనర్‌గా ఉన్న జైత్రాం పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో ప్రభాకర్‌ను కమిషనర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆయన పదవి బాధ్యతలను స్వీకరించారు. అనంతరం ఆయన చైర్మన్‌ యూనూస్‌, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు ఉజ్వల్‌రెడ్డిలను మర్యాద పూర్వకంగా కలిశారు.

రావి ఆకుపై రాష్ట్ర ఆవిర్భావ శోభ

నారాయణఖేడ్‌: త్యాగాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోంది. మంగళవారం నిర్వహించనున్న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌కు చెందిన పత్ర చిత్రకారుడు శివకుమార్‌ రావి ఆకుపై తెలంగాణ చరిత్ర, సంస్కృతి, సాగునీటి ప్రగతి, రైతు శక్తి, నాయకత్వం, కాకతీయ కళాతోరణం, భగీరథ, కాళేశ్వరం, బంగారు బతుకమ్మ, సీఎం రేవంత్‌రెడ్డి చిత్రాలను మలచి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement