మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యం

Jun 2 2026 7:40 AM | Updated on Jun 2 2026 7:40 AM

నారాయణఖేడ్‌: అర్హులకు సంక్షేమ పథకాలను అందించడమే కాకుండా గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే సంజీవరెడ్డి అన్నారు. మండలంలోని పోతనపల్లి (ఎం)లో సోమవారం ఐదు ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించి గృహ ప్రవేశాల్లో పాల్గొన్నారు. అనంతరం తాగునీటి అవసరాల కోసం తన ప్రత్యేక అభివృద్ధి నిధుల కింద నూతనంగా తవ్వించిన రెండు బోర్లను ప్రారంభించారు. అలాగే నిజాంపేట్‌ మండలంలోని మునిగేపల్లి, రాంచెందర్‌నాయక్‌ తండాల్లో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల కోసం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి పనులను గురించి వివరించారు. తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లోనే చదివించాలని గ్రామస్తులను కోరారు.

అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు

టీజీఐఐసీ చైర్‌ పర్సన్‌ నిర్మల జగ్గారెడ్డి

కంది(సంగారెడ్డి): అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనున్నట్లు టీజీఐఐసీ చైర్‌ పర్సన్‌ నిర్మల జగ్గారెడ్డి తెలిపారు. సోమవారం మండల పరిధిలోని కౌలంపేటలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి నియోజకవర్గ ప్రత్యేక అధికారి జ్యోతిలక్ష్మి, మండల ప్రత్యేక అధికారి తుల్జా నాయక్‌, ఎంపీడీఓ శ్రీనివాస్‌, హౌసింగ్‌ ఏఈ సుమ, కాంగ్రెస్‌ పార్టీ సంగారెడ్డి నియోజకవర్గ ఇన్‌చార్జి ఆంజనేయులు, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రామచంద్రనాయక్‌, సర్పంచ్‌ స్వాతి శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే సంజీవరెడ్డి

Advertisement
 
Advertisement
Advertisement