వట్‌పల్లి(అందోల్): ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే రోగులకు వైద్యులు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండడంతో పాటు సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందిచాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.లలితాదేవి అన్నారు. సోమవారం జోగిపేట్ ఏరియా ఆస్పత్రి, తాలేల్మ, నేరడిగుంట పీహెచ్‌సీలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆరోగ్య సిబ్బందికి సంబంధించిన రిజిస్టర్లను పరిశీలించారు. ఈ మేరకు సిబ్బందితో మాట్లాడి వైద్యసేవలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని వివిధ విభాగాలను సందర్శించారు. గడువు ముగిసిన మందులు ఎట్టి పరిస్థితుల్లోనూ నిల్వ ఉంచరాదని ఆదేశించారు. రోగులకు అవసరమైన మందులను ఉచితంగా అందించాలన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలన్నారు. వైద్యులు సిబ్బంది సమయం పాలన పాటించాలని స్పష్టం చేశారు. వైద్య సేవల విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తాలెల్మ పీహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్ సత్యనారాయణ పాల్గొన్నారు.
జిల్లా వైద్య ఆరోగ్యశాఖఅధికారి లలితాదేవి
తాలెల్మ, నేరడిగుంట పీహెచ్‌సీలఆకస్మిక తనిఖీ


