చెరువులో మునిగి యువకుడి మృతి | - | Sakshi
Sakshi News home page

చెరువులో మునిగి యువకుడి మృతి

Jun 2 2026 7:40 AM | Updated on Jun 2 2026 7:40 AM

హత్నూర(సంగారెడ్డి): చెరువులో మునిగి యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని షేర్‌ఖాన్‌పల్లి గ్రామ శివారులో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబీకుల కథనం ప్రకారం... హైదరాబాద్‌ ఫతేనగర్‌కు చెందిన మేకల రాఘవేందర్‌(18) మరో 13 మంది స్నేహితులతో కలిసి షేర్‌ఖాన్‌పల్లి గ్రామ శివారులోని పలుగుమీది నల్ల పోచమ్మ ఆలయ దర్శనానికి ఆదివారం వచ్చారు. దావత్‌ చేసుకొని సాయంత్రం స్నేహితులతో కలిసి చెరువులో నీటిలో ఆటలాడుతున్న క్రమంలో రాఘవేందర్‌ నీటిలో మునిగిపోయాడు. వెంటనే తోటి స్నేహితులు, అక్కడ ఉన్న కొంతమంది అతడ్ని చెరువులో నుంచి బయటకు తీసినప్పటికీ మృతి చెందాడు.

అనుమానాస్పద స్థితిలో రైతు..

సంగారెడ్డి: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన చౌటకూర్‌ మండల శివారులో చోటు చేసుకుంది. వివరాలు ఇలా... మండల కేంద్రానికి చెందిన రైతు శ్రీశైలం(50) రెండు రోజుల కింద అదృశ్యమయ్యాడు. కాగా మండల శివారులో చెట్టుకు ఉరివేసుకున్నాడు. సంఘటన స్థలానికి స్థానిక తహసీల్దార్‌ కిష్టయ్య వెళ్లి పరిశీలించారు. శ్రీశైలంను కొందరు కొద్ది రోజులుగా భూ తగాదాలతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement