అటకెక్కిన భారీ సాగునీటి ఎత్తిపోతల పథకాలు | - | Sakshi
Sakshi News home page

అటకెక్కిన భారీ సాగునీటి ఎత్తిపోతల పథకాలు

Jun 2 2026 7:34 AM | Updated on Jun 2 2026 7:34 AM

తెలంగాణ ఆవిర్భావం తర్వాత జిల్లాలో సాగు నీటి రంగం అభివృద్ధి జరుగుతుందని భావించారు. కానీ రైతుల ఆశలు ఇంకా నెరవేరలేదు. కొత్తగా ఆయకట్టుకు సాగునీరు అందిన దాఖలాల్లేవు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాల నిర్మాణానికి శంకుస్థాపనలు జరిగినా.. పనులు మాత్రం పట్టాలెక్కలేదు. కాంగ్రెస్‌ సర్కారు కూడా ఈ పథకాలను పట్టించుకోకపోవడంతో ఆయకట్టు రైతుల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. ఈ రెండు పథకాల నిర్మాణం పూర్తయితే దాదాపు 3.84 లక్షల ఎకరాల భూములు సాగులోకి వస్తుందని రైతులు భావించారు. కానీ రైతుల ఆకాంక్షలు ఇప్పట్లో నెరవేరే పరిస్థితులు కనిపించడం లేదు.

Advertisement
 
Advertisement
Advertisement