జోగిపేట(అందోల్): రాష్ట్ర వ్యాప్తంగా నర్సింగ్ విద్యకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. సోమవారం అందోలు మండలంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను కలెక్టర్ ప్రతీక్ జైన్‌తో కలిసి పరిశీలించారు. అందోలు వద్ద నిర్మిస్తున్న నర్సింగ్ కళాశాల, హాస్టల్ భవన నిర్మాణ పనులను, నూతనంగా మంజూరైన ఫార్మసీ కళాశాల భవన నిర్మాణం కోసం స్థలాన్ని పరిశీలించారు. అనంతరం నర్సింగ్ కళాశాల విద్యార్థినిలతో ముఖాముఖిగా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కళాశాలలో నెలకొన్న సమస్యలన్నింటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని హమీనిచ్చారు. నర్సింగ్ కళాశాల భవనం, వసతి గృహాలను త్వరలో ప్రారంభించేందుకు సివిల్ పనులను శరవేగంగా పూర్తి చేయించాలని అధికారులను ఆదేశించారు.
అజ్జమర్రి వంతెన పనుల పరిశీలన
రూ.80 కోట్లతో చేపడుతున్న అజ్జమర్రి వంతెన పనులను మంత్రి పరిశీలించారు. పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. జోగిపేటలోని బీసీ, ఎస్సీ సాంఘిక సంక్షేమ హాస్టళ్లను కలెక్టర్‌తో కలిసి పరిశీలించారు. విద్యార్థులకు అసౌకర్యంగా ఉన్న పనులను వెంటనే చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పాండు, మున్సిపల్ చైర్మన్ ఎస్.కృష్ణారెడ్డి, వైస్ చైర్మన్ చిట్టిబాబు, రాష్ట్ర మార్క్‌ఫెడ్ డైరెక్టర్ జగన్మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు
వట్‌పల్లి(అందోల్): పేద ప్రజల సొంతింటి కల నెరవేరుస్తామని మంత్రి సి.దామోదర రాజనర్సింహ అన్నారు. సోమవారం అందోల్ మండల పరిధిలోని మన్‌సాన్‌పల్లిలో ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాలను లబ్ధిదారులతో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్ పాండు తదితరులు పాల్గొన్నారు.
మూడు మాసాల్లో పనులు పూర్తి
మంత్రి దామోదర రాజనర్సింహ


