వేతనంలో కోత విధించడం సరికాదు | - | Sakshi
Sakshi News home page

వేతనంలో కోత విధించడం సరికాదు

Jun 2 2026 7:34 AM | Updated on Jun 2 2026 7:34 AM

సంగారెడ్డి ఎడ్యుకేషన్‌: ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆరోగ్య పథకం అమలు చేయడం కోసం ప్రభుత్వం విధివిధానాలు విడుదల చేయకుండా మే నెల వేతనం నుంచి కోత విధించడంపై ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు టీపీటీఎఫ్‌ ఉపాధ్యాయ సంఘాల నాయకులు సోమవారం కలెక్టరేట్‌ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా టీపీటీఎఫ్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సోమశేఖర్‌, రాంచందర్‌ మాట్లాడుతూ.. ఎంప్లాయిస్‌ హెల్త్‌ స్కీమ్‌ పేరిట మే నెల వేతనం నుంచి 1.5 శాతం ప్రభుత్వం కోత విధించడం సరికాదన్నారు. ఆరోగ్య పథకాన్ని అన్ని రకాలుగా తయారు చేసిన తర్వాతనే కోత విధించాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటికై నా ప్రభుత్వం ఆరోగ్య పథకానికి సంబంధించి అమలు, విధివిధానాలు, మార్గదర్శకాలు వెంటనే ప్రకటించాలని కోరా రు. అదేవిధంగా ప్రతి ఉద్యోగి ఆరోగ్య పథకంలో చేరాలా వద్దా అనే ఆప్షన్‌ కూడా ఇవ్వాలని కోరారు. ఆస్పత్రి జాబితా ప్రకటించడంతో పాటు ఏ వ్యాధులకు అవకాశం ఉందో తెలపాలన్నారు. ఆరోగ్య పథకం ద్వారా చికిత్స అమౌంట్‌ పరిమితి తెలియజేయాలని, భార్యాభర్తల విషయంలో ఇద్దరి నుంచి కాకుండా ఒకరి నుంచే కోత విధించాలని కోరారు. వేతన సవరణ కమిటీ రిపోర్టు తెప్పించుకొని ఫిట్మెంట్‌ అమలు చేయాలని, పెండింగ్లో ఉన్న ఐదు డిఏలు వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ నాయకులు లక్ష్మయ్య యాదవ్‌, శ్రీనివాస్‌, కమ్రుద్దీన్‌, సంజీవయ్య , నాజర్‌ పటేల్‌ తదితరులు పాల్గొన్నారు.

టీపీటీసీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల నిరసన

Advertisement
 
Advertisement
Advertisement