పేదల సొంతింటి కల సాకారం | - | Sakshi
Sakshi News home page

పేదల సొంతింటి కల సాకారం

Jun 2 2026 7:34 AM | Updated on Jun 2 2026 7:34 AM

నారాయణఖేడ్‌: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేద కుటుంబాల సొంతింటి కల సాకారమవుతోందని జహీరాబాద్‌ ఎంపీ సురేష్‌ షెట్కార్‌ అన్నారు. ఖేడ్‌ మున్సిపాలిటీ పరిధిలో సోమవారం ఎమ్మెల్యే సంజీవరెడ్డితో కలిసి అయిదు మంది లబ్ధిదారులకు సంబంధించిన ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించి గృహప్రవేశ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హులైన ప్రతిపేద కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. సంక్షేమంతోపాటు అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యమన్నారు. మున్సిపల్‌ కమిషనర్‌ ప్రశాంతి, కౌన్సిలర్లు స్వప్న అభిషేక్‌ షెట్కార్‌, వివేకానంద్‌, రాజు, మహేష్‌, గోపాల్‌రెడ్డి, మైతాబ్‌, మండల కాంగ్రెస్‌ అధ్యక్షులు తాహెర్‌అలీ పాల్గొన్నారు.

ఎస్సీ సెల్‌ ఉపాధ్యక్షుడికి సన్మానం

కాంగ్రెస్‌ ఎస్సీసెల్‌ జిల్లా ఉపాధ్యక్షులుగా నియమితులైన మనూరు మండలం శెల్గిర్గాకు చెందిన మాజీ ఎంపీటీసీ మేటి పురంజన్‌ను ఖేడ్‌లోని తన స్వగృహంలో ఎంపీ సన్మానించారు. పీసీసీ సభ్యులు శంకరయ్యస్వామి, దిశ కమిటీ సభ్యులు ప్రకాష్‌ రాథోడ్‌, కౌన్సిలర్లు వివేకానంద్‌, మైతాబ్‌, మాజీ జెడ్పీటీసీ నిరంజన్‌, ఖేడ్‌, మనూరు, నాగల్‌గిద్ద మండలాల కాంగ్రెస్‌ అధ్యక్షులు తాహెర్‌అలీ, సుభాష్‌ పటేల్‌, మాణిక్‌రావు పాల్గొన్నారు. కాగా, ఖేడ్‌ పట్టణంలోని మహాతి జ్యోతిష్యాలయ ఆవరణలో అధికజ్యేష్ట మాసాన్ని పురస్కరించుకుని లోకకల్యాణం కోసం పురోహితులు, స్మార్త జ్యోతిష్య చండీ ఉపాసకులు గురురాజ శర్మ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న లక్ష్మీ సుదర్శన యాగంలో ఎంపీ సురేష్‌ షెట్కార్‌, ఉమాదేవి షెట్కార్‌ దంపతులు పాల్గొని ప్రత్యేకపూజా కార్యక్రమాలు నిర్వహించారు.

ఎంపీ సురేష్‌ షెట్కార్‌

ఖేడ్‌లో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభం

Advertisement
 
Advertisement
Advertisement