అవతరణ’ వేడుకలకు సర్వం సిద్ధం | - | Sakshi
Sakshi News home page

అవతరణ’ వేడుకలకు సర్వం సిద్ధం

Jun 2 2026 7:34 AM | Updated on Jun 2 2026 7:34 AM

ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ పరితోష్‌

సంగారెడ్డి జోన్‌: రాష్ట్రావతరణ దినోత్సవ వేడుకలకు పరేడ్‌ గ్రౌండ్‌ సర్వం సిద్ధమైంది. మంగళవారం నిర్వహించే వేడుకల ఏరాట్లను ఎస్పీ పరితోష్‌ పంకజ్‌, అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి పరిశీలించారు. పరేడ్‌ గ్రౌండ్‌లో పోలీసు సిబ్బంది రిహార్సల్స్‌ నిర్వహించారు. అమరవీరుల స్తూపం అలంకరణ, స్టాల్స్‌ ఏర్పాట్లు, పోలీసు భద్రత తదితర ఏర్పాట్లు పరిశీలించారు. వేడుకలకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హాజరు కానున్నారు. ముందుగా అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించి, పరేడ్‌ గ్రౌండ్‌లో నిర్వహించే వేడుకల్లో పాల్గొంటారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసు అధికారులచే గౌరవ వందనం స్వీకరిస్తారు. పాఠశాల విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. దృష్టిలోపం ఉన్న విద్యార్థులకు ల్యాప్‌ టాప్‌, ట్రాన్స్‌జెండర్‌లకు గుర్తింపు కార్డులు పంపిణీ చేయనున్నారు. అనంతరం వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన స్టాల్స్‌ లను సందర్శిస్తారు.

Advertisement
 
Advertisement
Advertisement