నర్సాపూర్ రూరల్: సంతానం కలగడం లేదని మనస్తాపానికి గురైన మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన నర్సాపూర్ మండలంలోని రెడ్డిపల్లిలో చోటు చేసుకుంది. ఎస్సై రంజిత్ రెడ్డి కథనం ప్రకారం... గ్రామానికి చెందిన కట్ట రామయ్యతో కొన్నేళ్ల క్రితం పెద్దలు ఊర్మిళకు వివాహం జరిపించారు. ఏండ్లు గడిచినా పిల్లలు పుట్టక పోవడంతో ఆమె తరచూ బాధపడేది. శనివారం పొలం వద్దకు వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి బయటకు వెళ్లి ఊరకుంటలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


