నారాయణఖేడ్: ప్రతీ ఒక్కరూ సీ్త్ర జాతిని గౌరవించాలని ప్రపంచ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి, బాల మేధావి నైనా జైస్వాల్ పేర్కొన్నారు. మనూరు మండలంలోని బోరంచ నల్లపోచమ్మ ఆలయంలో కొనసాగుతున్న ఏడువారాల జాతరకు ఆదివారం ఆమె కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు. ఆలయంలో ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి, అనుపమారెడ్డి దంపతులతోపాటు పూజారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అమ్మవారికి నైనా జైస్వాల్ కుటుంబ సభ్యులు పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా నైనా జైస్వాల్ మాట్లాడుతూ.. అమ్మవారిని నమ్ముకుంటే ధైర్యం, శౌర్యం, శక్తి, సామర్థ్యం, దృఢత్వం, పరాక్రమం, శ్రద్ధ, తేజస్సును ప్రసాదిస్తుందన్నారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మల్లయ్య, ఈవో శివరుద్రప్ప, పూజారులు సిద్దుస్వామి, నగేశ్ స్వామి, శ్రీకాంత్‌స్వామి, ప్రవీణ్, సిబ్బంది శేఖర్ పాల్గొన్నారు.
ప్రపంచ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్


