ఒకే రోజు తండ్రీకొడుకులు మృతి | - | Sakshi
Sakshi News home page

ఒకే రోజు తండ్రీకొడుకులు మృతి

Jun 1 2026 7:35 AM | Updated on Jun 1 2026 7:35 AM

బలి తీసుకున్న అనారోగ్యం

కల్హేర్‌(నారాయణఖేడ్‌): గంటల వ్యవధిలో తండ్రి,కొడుకు ఒకే రోజు మరణించారు. ఈ ఘటన మండలంలోని మార్డిలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బోమ్మల పోచయ్య(69), బోమ్మల రాజు(39) ఇటీవల అనారోగ్యం బారిన పడ్డారు. బోమ్మల పోచయ్య ఇంట్లోనే మంచం పట్టాడు. రాజు హైదరాబాద్‌లో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. తుదిశ్వాస వరకు చూసుకోవాల్సిన కొడుకు రాజు అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరడంతో మనోవేదనకు గురైన పోచయ్య ఇంట్లోనే మరణించాడు. తండ్రి పోచయ్య మరణవార్త తెలిసిన రాజు రాత్రి మృతి చెందాడు. తండ్రీ, కొడుకు ఒకే రోజు మరణించడంతో కుటుంబీకులు, గ్రామస్తులు విషాదంలో మునిగారు. ఆదివారం సాయంత్రం ఇద్దరి అంత్యక్రియలు నిర్వహించారు.

Advertisement
 
Advertisement
Advertisement