ఇళ్లు | - | Sakshi
Sakshi News home page

ఇళ్లు

Jun 1 2026 7:29 AM | Updated on Jun 1 2026 7:29 AM

నారాయణఖేడ్‌: రెండో విడతలో జిల్లాకు 10వేల ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం కేటాయించింది. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేసి నిర్మాణాలను ఈనెల నుంచి ప్రారంభించనున్నారు. ఆసిఫాబాద్‌ జిల్లా కొఠారి గ్రామంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రెండో విడత ఇళ్ల మంజూరుకు శ్రీకారం చుట్టిన అనంతరం అన్ని జిల్లాల్లోనూ ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వం మొదటి విడత నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇందిరమ్మ ఇళ్లను కేటాయించింది. కాగా, రెండో విడతలో నియోజకవర్గానికి 2వేల చొప్పున జిల్లాలోని ఐదు నియోజక వర్గాలకు కలిపి 10వేల ఇళ్లు కేటాయించింది. ఇప్పటికే మొదటి విడత ఇళ్ల నిర్మాణాలు జోరుగా సాగుతుండగా త్వరలో రెండో విడత పనులు సైతం ప్రారంభం కానున్నాయి. పేద కుటుంబాల లబ్ధిదారులకు వారి సొంత స్థలాలున్న వారికి ఇళ్ల నిర్మాణాలకు ప్రభుత్వం రూ.5లక్షల సాయం అందిస్తుంది. 400 నుంచి 600 చదరపు అడుగుల మధ్య లబ్ధిదారులే ఇళ్లను నిర్మించుకోవాలి.

కాగా మొదటి విడత ఇళ్ల నిర్మాణాల్లో చాలా నిర్మాణాలు ప్రారంభం కాకపోవడం, రెండో విడత ఇళ్లు మంజూరు అవుతుండటంతో నిర్మాణాలను వేగవంతం చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. మొదటి విడత మంజూరైన లబ్ధిదారులు నిర్మాణాలు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. లేని పక్షంలో మరో విడతలో మంజూరుకు స్వీయ దరఖాస్తు స్వీకరించి ఆ ఇల్లును ఇతర లబ్ధిదారుకు కేటాయించనున్నారు. రెండో విడత కోసం ఎదురు చూస్తున్న లబ్ధిదారులకు త్వరలో ఇళ్ల మంజూరు ఇవ్వనున్నారు.

10

ఇందిరమ్మ

వేల

రెండో విడతలో జిల్లాకు కేటాయింపు

నియోజకవర్గానికి 2వేల చొప్పున.. ఈ నెలలోనే లబ్ధిదారుల ఎంపిక, ప్రారంభం

నిర్మాణాలిలా..

జిల్లాలో 1,143 ఇళ్లు పూర్తవగా వాటికి గృహ ప్రవేశాలు పూర్తి చేశారు. అర్హులుగా గుర్తించి వారిలో మొదటివిడత కింద 16,559మందిని గుర్తించగా వారిలో 15,773మందికి కలెక్టర్‌ ఇళ్లను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో 3,124మంది లబ్ధిదారులు వివిధ కారణాలతో ఆన్‌లైన్‌లో క్యాన్సిల్‌ అవ్వగా 12,649మంది లబ్ధిదారులను గుర్తించారు. 8,758 మందికి మర్కోట్‌ ఇవ్వగా 7,136మందికి గ్రౌండింగ్‌ పూర్తి చేశారు. బేస్మెంట్‌ (బీఎల్‌) స్థాయిలో 1,140, రూఫ్‌లెవల్‌ స్థాయిలో 880, ఆర్‌సీసీ స్థాయిలో 3,673 ఉండగా 1,143 ఇళ్లు పూర్తయ్యాయి. 3,891మంది లబ్ధిదారులు ఇంకా ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించలేదు. వివిధ స్టేజీల్లో ఉన్న ఇళ్లకు సంబంధించి ప్రభుత్వం రూ.195.74 కోట్లను చెల్లించింది.

1.36 లక్షలు అర్హులు..

ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు సందర్భంగా ఎల్‌–1, ఎల్‌–2, ఎల్‌–3 ప్రకారం దరఖాస్తులను తీసుకుని వారి దరఖాస్తుల ఆధారంగా మూడు కేటగిరీల కింద విభజించింది. ఎల్‌–1 కింద సొంత స్థలాలున్న లబ్ధిదారులు, ఎల్‌–2 కింద సొంత స్థలం లేని, ఇల్లు లేని వారు, ఎల్‌–3 కింద ఇతరులుగా నిర్ధారించారు. తమకు ఇందిరమ్మ ఇళ్లను కేటాయించాలని జిల్లాలో 3,18,435 మంది దరఖాస్తులు సమర్పించగా, ఇందులో 1,36,821మందిని అర్హులుగా అధికారులు నిర్ధారించారు.

వేగవంతానికి చర్యలు

Advertisement
 
Advertisement
Advertisement