అంగన్‌వాడీ ఖాళీల భర్తీ! | - | Sakshi
Sakshi News home page

అంగన్‌వాడీ ఖాళీల భర్తీ!

Jun 1 2026 7:29 AM | Updated on Jun 1 2026 7:29 AM

ప్రభుత్వ ఆదేశాల మేరకు నియామకాలు ఉంటాయి. పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల కాగానే మార్గదర్శకాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటాం. ఖాళీగా ఉన్న కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సేవలు అందిస్తున్నాం.

– లలిత కుమారి,

జిల్లా సంక్షేమ అధికారి, సంగారెడ్డి జిల్లా

సంగారెడ్డి జోన్‌: జిల్లావ్యాప్తంగా అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న టీచర్‌ ఆయా పోస్టులను ప్రభుత్వం త్వరలోనే భర్తీ చేయనున్నారు. ఈ మేరకు త్వరలోనే నోటిఫికేషన్‌ విడుదల కానున్నట్లు సమాచారం. ఇప్పటికే అధికార యంత్రాంగం ఈ మేరకు భర్తీకి సన్నాహాలు ప్రారంభించింది. వేసవి సెలవుల అనంతరం జూన్‌ 1 నుంచి కేంద్రాలు పునఃప్రారంభం కానున్నాయి.

79 టీచర్‌.. 416 ఆయా పోస్టులు

జిల్లావ్యాప్తంగా ఖేడ్‌, సదాశివపేట, జహీరాబాద్‌, అందోల్‌, పటాన్‌చెరు ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి. వీటి పరిధిలో 1,504 అంగన్‌వాడీ కేంద్రాలు కొనసాగుతున్నాయి. ఆయా కేంద్రాల్లో 79 టీచర్‌, 416 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఐదేళ్లలోపు చిన్నారులు 98,450 మంది ఉన్నారు. ఈ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు వివిధ రకాల సేవలు అందిస్తుంటారు. త్వరలో కేంద్రాలకు వచ్చే చిన్నారులకు ప్రీ ప్రైమరీ విద్యను అందించనున్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి చిన్నారులకు కేంద్రాల వద్ద నాణ్యమైన, రుచికరమైన బ్రేక్‌ ఫాస్ట్‌ అందించేందుకూ రూపకల్పన చేస్తున్నారు.

కలెక్టర్‌ ఆధ్వర్యంలో

అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీ పోస్టులను భర్తీకి కలెక్టర్‌ ఆధ్వర్యంలో నోటిఫికేషన్‌ విడుదల చేసి మార్గదర్శకాలకనుగుణంగా నియామకాలు చేయనున్నారు. నియామకాలకు సంబంధించి విద్యార్హతల్లో పలు మార్పులు చేశారు. ఇంటర్మీడియెట్‌ పూర్తి చేసిన వారిని అర్హులుగా గుర్తించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఖాళీగా ఉన్న కేంద్రాల్లో ఇతర సిబ్బందితో కొనసాగిస్తున్నారు.

త్వరలో నోటిఫికేషన్‌

జిల్లాలో 79 టీచర్‌, ఆయా పోస్టులు ఖాళీ

నేటి నుంచి కేంద్రాల పునఃప్రారంభం

ప్రభుత్వ ఆదేశాల మేరకు

Advertisement
 
Advertisement
Advertisement