బోర్పట్లలో ధాన్యం కొనుగోలు వేగవంతం | - | Sakshi
Sakshi News home page

బోర్పట్లలో ధాన్యం కొనుగోలు వేగవంతం

Jun 1 2026 7:29 AM | Updated on Jun 1 2026 7:29 AM

హత్నూర(సంగారెడ్డి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బోర్పట్ల రానున్న నేపథ్యంలో గ్రామంలోని ధాన్యం కొనుగోలు అధికారులు స్వయంగా దగ్గరుండి ఆదివారం వేగవంతం చేశారు. బోర్పట్ల గ్రామంలో సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో 35 లారీలకు పైగా ధాన్యం నిల్వలు ఉండటంతో జిల్లా ఉన్నతస్థాయి అధికారులు రంగంలోకి దిగారు. లారీలను పంపిస్తూ ధాన్యాన్ని రెండురోజుల్లో పూర్తిస్థాయిలో కొనుగోలు చేసి రైస్‌మిల్లులకు పంపించాలని ఉన్నతాధికారులు ఆదేశించడంతో కొనుగోళ్లు వేగవంతమయ్యాయి.

సీఎం రానున్న నేపథ్యంలో

రెండు రోజుల్లో పూర్తికానున్న కొనుగోళ్లు

Advertisement
 
Advertisement
Advertisement