చిన్నశంకరంపేట(మెదక్): చారిత్రక కట్టడాలను పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని టూరిజం శాఖ జిల్లా అధికారి రమేశ్ కోరారు. శనివారం మండలంలోని చందంపేట గ్రామంలో చారిత్రక చందమ్మ కోటదుర్గం, మెట్లబావిని టూరిజం శాఖ అధికారులతో కలిసి హెరిటేజ్ డెక్కన్ మీర్‌ఖాన్ బృందం సభ్యులు పరిశీలించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో చారిత్రక కట్టడాల పరిరక్షణకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. చారిత్రక కట్టడాలను పరిరక్షించి పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో చారిత్రక పరిశోధకులు సందీప్, రమేశ్, హెరిటేజ్ డెక్కన్ మీర్‌ఖాన్ బృందం సభ్యులు పాల్గొన్నారు.


