గజ్వేల్‌రూరల్: ఎస్సీ వర్గీకరణ చట్టం, రోస్టర్ విధానంతో పాటు జనాభా లెక్కల్లో మాలలకు జరిగిన అన్యాయాన్ని ఖండిస్తున్నామని మాల సంఘాల జేఏసీ చైర్మన్ మాందాల భాస్కర్ పేర్కొన్నారు. శనివారం రాష్ట్ర మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో గజ్వేల్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాల సంఘాల జేఏసీ వైస్‌చైర్మన్ తుమ్మ శ్రీనివాస్, స్టూడెంట్ జేఏసీ చైర్మన్ మాదాసు రాహుల్‌రావు, గ్రేటర్ హైదరాబాద్ చైర్మన్ బత్తుల రమేశ్‌తో కలిసి ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ప్రకటించిన జనాభా లెక్కల ప్రకారం మాల సామాజిక వర్గానికి తీవ్ర అన్యాయం జరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వం మాల కమ్యూనిటీపై కక్షపూరిత వైఖరిని ప్రదర్శిస్తుందని ఆరోపించారు. ఇటీవల విడుదలైన ఉద్యోగ నోటిఫికేషన్లలో మాల సామాజిక వర్గానికి చెందిన 26కులాలకు అవకాశాలు లేకపోవడం, ఉద్యోగులకు ప్రమోషన్లు రాకపోవడం, విద్యార్థులకు సీట్లు తగ్గడం వంటి అంశాలు ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. మాలలకు జరుగుతున్న అన్యాయాన్ని ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులకు వివరిస్తూ... హక్కుల సాధనకు పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు సత్యనారాయణ, దేవేందర్, స్వామి, శివకుమార్, శ్రీనివాస్, గిరి, స్వామి పాల్గొన్నారు.
మాల సంఘాల జేఏసీ చైర్మన్ భాస్కర్


