పటాన్‌చెరు టౌన్: మూతబడిన పీఓపీ పరిశ్రమలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటన పటాన్‌న్‌చెరులో శనివారం చోటుచేసుకుంది. అగ్నిమాపక శాఖ అధికారుల వివరాల ప్రకారం... పటాన్‌న్‌చెరు అబ్కారీ కార్యాలయం సమీపంలో గతంలో ఒక పరిశ్రమ కార్యకలాపాలు నిర్వహించేది. ప్రస్తుతం ఆ పరిశ్రమ మూతబడటంతో ఆ స్థలం ఖాళీగా ఉంది. ఇందులో డెకరేషన్ పనులు చేసే వారు పీఓపీతో తయారు చేసిన వస్తువులను నిల్వ ఉంచేవారు. శనివారం అకస్మాత్తుగా పీఓపీ వస్తువులకు మంటలు అంటుకున్నాయి. మంటలు వ్యాపించి దట్టమైన పొగలు ఎగసిపడటంతో పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపారు. కాగా, ఎవరో నిర్లక్ష్యంగా సిగరెట్‌ను వెలిగించి పడేయడంతోనే మంటలు చెలరేగి ఉండవచ్చని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.


