సంగారెడ్డి జోన్: ఓటరు జాబితాలో ఎలాంటి తప్పులు లేకుండా పారదర్శకంగా రూపొందించేందుకు చేపట్టిన సర్ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ప్రతీక్‌జైన్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి, అదనపు ఎన్నికల అధికారి వాసం వెంకటేశ్వర్లు శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా నుంచి కలెక్టర్‌తోపాటు అదనపు కలెక్టర్లు సంగీత, పాండు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాన ఎన్నికల అధికారి మాట్లాడుతూ..పారదర్శకంగా ఓటరు జాబితా రూపొందించాలన్నారు. ఈ సమావేశంలో ఖేడ్ సబ్ కలెక్టర్ ఉమహారతి, ఆర్డీవోలు, తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ ప్రతీక్‌జైన్


