నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు | - | Sakshi
Sakshi News home page

నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు

May 30 2026 8:41 AM | Updated on May 30 2026 8:41 AM

తూప్రాన్‌: రైతులకు సకాలంలో నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించాలని ఆర్డీఓ జయచంద్రారెడ్డి డీలర్లకు సూచించారు. శుక్రవారం డివిజన్‌ కేంద్రంలో ఫర్టిలైజర్‌ దుకాణాలను డివిజన్‌ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ఆధ్వర్యంలో తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ.. వానాకాలం సీజన్‌ ప్రారంభమవుతున్న నేపథ్యంలో యూరియా బ్లాక్‌ చేయకుండా జాగ్రత్తలు చేపట్టినట్లు తెలిపారు. అధిక ధరలకు అమ్మితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం సీఐ వెంకటరాజుగౌడ్‌ మాట్లాడుతూ.. నకిలీ విత్తనాలను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి డీలర్‌ రోజువారీ క్రయవిక్రయాలను రిజిస్టర్‌లో నమోదు చేయడంతో పాటు స్టాక్‌ బోర్డు కనిపించే విధంగా ప్రదర్శించాలని ఆదేశించారు.

Advertisement
 
Advertisement
Advertisement