18 శాతం బడ్జెట్‌ కేటాయించాలి | - | Sakshi
Sakshi News home page

18 శాతం బడ్జెట్‌ కేటాయించాలి

May 30 2026 8:41 AM | Updated on May 30 2026 8:41 AM

సంగారెడ్డి ఎడ్యుకేషన్‌: విద్యకు అధిక ప్రాధాన్యతనిస్తూ బడ్జెట్‌లో 18% నిధులు కేటాయించాలని టీపీటీఎఫ్‌ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు వై.అశోక్‌ కుమార్‌ డిమాండ్‌ చేశారు. టీపీటీఫ్‌ 13వ ఆవిర్భావ దినోత్సవాన్ని సంగారెడ్డిలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీపీటీఎఫ్‌ జెండాను జిల్లా అధ్యక్షుడు సోమశేఖర్‌ ఆవిష్కరించారు. అనంతరం అశోక్‌కుమార్‌ మాట్లాడుతూ...ఉపాధ్యాయ లోకంలో టీపీటీఫ్‌ ఒక ప్రత్యేకమైన అస్తిత్వం, ప్రాధాన్యత కలిగిన సంఘమన్నారు. ఉపాధ్యాయుల సేవల కోసమే కాకుండా, ‘బాధ్యతలకు నిలబడు – హక్కులకై కలబడు’నినాదంతో సమాజంలో పేద పిల్లలందరికీ నాణ్యమైన, శాసీ్త్రయమైన ఉచిత విద్య అందాలనే నిబద్ధతతో పనిచేసే ఏకై క సంఘం మనదని గుర్తుచేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా విద్యా రంగాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. ప్రభుత్వ విద్యా సంస్థలను నిర్వీర్యం చేసే కుట్రలను ఉపాధ్యాయలోకం ఏకమై తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. నిధుల కొరత, మౌలిక వసతుల లేమి వల్ల పేద ప్రజలకు ఉచిత విద్య అందని ద్రాక్షగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. 317 జీవో బాధితులకు న్యాయం జరిగే వరకు, సీపీఎస్‌ రద్దయ్యే వరకు, ఉపాధ్యాయుల ఆర్థిక, సాంఘిక భద్రత కల్పించే వరకు మరిన్ని క్షేత్రస్థాయి ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి అనుముల రాంచందర్‌, రాష్ట్ర కౌన్సిలర్లు సంజీవయ్య, భూమి శ్రీనివాస్‌, కంరోద్దీన్‌, జిల్లా ఉపాధ్యక్షురాలు మర్రి ప్రశాంతి, విజయ్‌ భాస్కర్‌, జిల్లా కార్యదర్శులు జగన్నాథం, బానోత్‌ రవీందర్‌, సుమలత, అకడమిక్‌ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

టీపీటీఎఫ్‌ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అశోక్‌

Advertisement
 
Advertisement
Advertisement